టీడీపీకి మరో షాక్
BY Telugu Gateway21 Sept 2019 4:49 PM IST

X
Telugu Gateway21 Sept 2019 4:49 PM IST
ఏపీలో దారుణ ఓటమి అనంతరం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి వలసల జోరు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరుడు కోడూరు కమలాకర్‌రెడ్డి శనివారం వైసీపీలో చేరారు.
ఆయనను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న కమలాకర్‌రెడ్డి తాజాగా వైఎస్సార్సీపీలో చేరడంతో నెల్లూరు రూరల్‌లో దాదాపు టీడీపీ ఖాళీ అయినట్టు అయింది.
Next Story