Telugu Gateway
Cinema

‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కెటీఆర్..పవన్

‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కెటీఆర్..పవన్
X

చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహరెడ్డి’ విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ఇఫ్పటికే ప్రచార జోరు పెంచింది. అందులో భాగంగానే ఈ నెల18న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి కెటీఆర్ తోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, వి వి వినాయక్ హాజరవుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో అమితాబచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాళం, కన్నడంలో సైరా నరసింహరెడ్డి విడుదల కానుంది. ఈ సినిమాను హీరో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే చిత్ర ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.

Next Story
Share it