‘సైరా’ సెన్సార్ పూర్తి
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా నరసింహరెడ్డి’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సినిమా యు/ఏ సర్టిఫికెట్ సాధించింది. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సినిమా వీక్షించేందుకు రెడీనా? అంటూ చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా సెన్సార్ విషయాన్ని వెల్లడించింది. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.