Telugu Gateway
Cinema

‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్ టైటిల్ కు జస్టిఫికేషనా!?

‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్ టైటిల్ కు జస్టిఫికేషనా!?
X

టైటిల్ కు జస్టిఫికేషన్ ఇవ్వాలనుకున్నారేమో. ఫస్ట్ లుక్ లోనే ‘రొమాన్స్’ అంతా చూపించారు. సోమవారం నాడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో హీరోయిన్ పైగా ఏ మాత్రం అచ్చాదన లేకుండా ఉంది. అదీ హీరోతో కౌగిలింతతో. దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోడల్ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. వృతిపరంగా మోడల్ అయిన కేతికా శర్మ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో అదరగొడుతుంది.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైన కొద్ది గంటలకే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్ లో ఈమెకు 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందించగా..అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం.

Next Story
Share it