Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డి సవాల్
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికను రెఫరెండంగా స్వీకరిస్తారా? అని ఛాలెంజ్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కెసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కే దుక్కుతుందన్నారు. కేసీఆర్ చర్యల వల్ల పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష రూపాయల భారం పడుతుందన్నారు.

రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పగిస్తే.. కేసీఆర్ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ దుబారా వ్యయాన్ని కాగ్ నివేదిక కూడా తప్పుపట్టిందని రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు ఇంకా అప్పులు చేస్తానంటూ కేసీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Next Story
Share it