Telugu Gateway
Cinema

‘రాజుగారి గది3’ ట్రైలర్ విడుదల

‘రాజుగారి గది3’ ట్రైలర్ విడుదల
X

రాజుగారి గది సీక్వెల్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆలరించాయి. ఇప్పుడు అందులో భాగంగా మూడవ భాగం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను సీనియర్ హరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ ‘రాజుగారి గది’ రెండు భాగాలు మంచి సక్సెస్‌ అయ్యాయి. సెకండ్‌ పార్ట్‌ లో కామెడీ మిస్‌ అయింది అన్నారు. అది దృష్టిలో ఉంచుకొని ‘రాజుగారి గది 3’ కథ రెడీ చేశా’’ అన్నారు. ఈ సినిమాలో అశ్విన్‌బాబు, అవికా గోర్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

‘‘రెండు నెలల్లో సినిమా పూర్తి చేశాం. అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. మా సినిమా వందశాతం ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు. ‘‘మూడేళ్ల తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఓంకార్‌ కథ చెప్పగానే థ్రిల్‌ అయ్యాను’’ అన్నారు అవికా గోర్‌. ‘‘ఈ సినిమాలో దెయ్యం ఆహ్లాదంగా నవ్విస్తుంది. భయపెడుతూ నవ్విస్తుంది. ఓంకార్‌ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌.

https://www.youtube.com/watch?v=boJtBqIJ6Ls

Next Story
Share it