వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్
BY Telugu Gateway26 Sept 2019 7:31 PM IST
X
Telugu Gateway26 Sept 2019 7:31 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా తాను వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో జరుగుతున్న రౌండ్ సమావేశానికి ఇదే కారణంతో హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. మీడియా స్వేచ్చ కోసం చేస్తున్న ఈ పోరాటానికి జనసేన తరపున, వ్యక్తిగతంగా తన మద్దతు ఉంటుందన్నారు. గబ్బర్ సింగ్ షూటింగ్‌లో వెన్నుమొకకు తగిలిన గాయం మళ్లీ ఎక్కువ అయినట్లు తెలిపారు.
వైద్యులు శస్త్ర చికిత్సకు వెళ్ళాలని సూచించినా..సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో తాను ఆ పని చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో కొంత అశ్రద్ధ చేయటం వల్ల కూడా నొప్పి పెరిగిందని వెల్లడించారు. అయితే జనసేన తరపున పార్టీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అవుతారని తెలిపారు.
Next Story