సిగ్గులేని ప్రచారంతో రెచ్చిపోతారా?

X
వైసీపీ నేతలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన మండిపడ్డారు. శవాల మీద రాజకీయ లబ్ది కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా? కోడెలని కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా? మీరసలు మనుషులేనా?
మీకసలు విలువలనేవే లేవా? కోడెలది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ హత్యే. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా? అంటూ మండిపడ్డారు.
Next Story



