గ్యాంగ్ లీడర్ కొత్త ట్రైలర్
BY Telugu Gateway12 Sept 2019 5:41 PM IST

X
Telugu Gateway12 Sept 2019 5:41 PM IST
నాని గ్యాంగ్ లీడర్ కొత్త ట్రైలర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. సినిమా శుక్రవారం నాడు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది. ఈ సినిమాలో పెన్సిల్ పార్ధసారధి పాత్ర పోషిస్తున్న నాని ఓ స్టోరీ చెబుతుంటే ఆయన గ్యాంగ్ అంతా గురకపెట్టి నిద్రపోతూ ఉంటుంది. ఇది చూసిన నాని ‘ యూ ఇరిటేటింగ్ ఇర్రెస్పాన్సబుల్ రివెంజర్స్’ అంటూ చెప్పే డైలాగ్ నవ్వులు తెప్పిస్తుంది.
అంతకు ముందు నాని ఒక దుర్మార్గుడికి చావు దగ్గర పడుతున్న టైమ్ లో ..వాతావరణం ఇలా గంభీరంగా మారుపోతుంది.ఆకాశం ఉరుముతుంది. సముద్రం పొంగుతుంది’ అంటూ కథ చెబుతూ ఉంటాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=mdikhVjdAD4
Next Story



