‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్ వచ్చేసింది
దర్శకుడు హీరో అయ్యారు. హీరో నిర్మాతగా మారారు. వాళ్ళిద్దరే తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకు తొలి సినిమాతోనే సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా మారి..‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ ముందుకొస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాకు నిర్మాత విజయ్ దేవరకొండ.
తరుణ్ భాస్కర్, అనసూయ, అభినవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం.. ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకుంది. ఎన్నో ఆసక్తికర అంశాలతో టీజర్ విడుదలైంది. 'సిగరెట్,మందు తాగడం, అబద్దాలు చెప్పడం ఆరోగ్యానికి హానికరం అంటూ ముగిసిన ఈ టీజర్‌లో తరుణ్ భాస్కర్ హైలెట్‌గా నిలిచాడు. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్ లో తరుణ్ భాస్కర్ హావభావాలు..డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
https://www.youtube.com/watch?time_continue=1&v=VifLV61mjo4