Telugu Gateway
Politics

కెటీఆర్ సీఎం...కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కెటీఆర్ సీఎం...కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకో పదేళ్ళు అయినా ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు. టీఆర్ఎస్ మరో మూడు సార్లు అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ దిగిపోయి సీఎం సీట్లో కెటీఆర్ ను కూర్చోపెడతారని ప్రచారం జరుగుతోందని అది అంతా అబద్దం అని కొట్టిపారేశారు. తన ఆరోగ్యంపై కూడా దుష్ప్రచారం జరుగుతోందని..తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. తన వయస్సు 66 సంవత్సరాలు అని..మరో పదేళ్ళు పనిచేయగలుగుతానని పేర్కొన్నారు.

ఏపీలో నీటిని సద్వినియోగం చేసుకునేందుకు త్వరలోనే మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసమే ఈ దిశగా పయనిస్తున్నట్లు వెల్లడించారు. అందుకే పాత వివాదాలను కూడా పక్కన పెట్టి ముందుకు సాగుతున్నామని తెలిపారు. దుమ్ముగూడెం వద్ద బ్యారేజ్ ప్రతిపాదిస్తున్నామని..ఈ మేరకు త్వరలోనే ఏపీ ఇంజనీర్లతో సమావేశం ఉంటుందని తెలిపారు. కృష్ణా-గోదావరి నధుల అనుసంధానం జరిగితే రెండు రాష్ట్రాలకు నీటి సమస్య ఉండదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 35 నుంచి 40 టీఎంసీల వరకూ ఎలాంటి ముంపు లేకుండా నీటిని నిల్వ చేసుకోవచ్చని అన్నారు.

Next Story
Share it