కోడెల కూతురి ఫిర్యాదు
BY Telugu Gateway17 Sep 2019 3:57 PM GMT

X
Telugu Gateway17 Sep 2019 3:57 PM GMT
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు..ప్రతివిమర్శలతో రాజకీయాలు చేస్తుండటంతో ఈ వ్యవహారం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తీసుకుంటోంది. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వేధింపుల వల్లే తన తండ్రి చనిపోయారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన సర్కారు తన తండ్రిని పలు వేధింపులకు గురిచేసిందని తన ఫిర్యాదులో పేర్కొంది. రాజకీయ కక్షలో భాగంగానే తన తండ్రి తో పాటు తన అన్న తన ఫై కేసులతో వేదించారని విజయ లక్ష్మి ఫిర్యాదు చేశారు.
Next Story