Telugu Gateway
Telangana

వినాయకుడు అంటే ఖైరతాబాద్..లడ్డూ అంటే బాలాపూర్

వినాయకుడు అంటే ఖైరతాబాద్..లడ్డూ అంటే బాలాపూర్
X

హైదరాబాద్ లో వినాయకచవితి అంటే రెండు ప్రత్యేకతలు ఉంటాయి. వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు మాత్రమే అన్నట్లు జనం అంతా లక్షల్లో ఖైరతాబాద్ తరలివచ్చి దర్శించుకుంటారు. లడ్డూ అంటే బాలాపూర్ లడ్డూనే. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర లడ్డూలు ఉన్నా వాటికి అంతగా ప్రాముఖ్యత ఉండదు. మహానగరంలో వెరైటీ గణనాధులు చాలా చోట్ల ఉంటారు. ఇవన్నీ నిమజ్జనం రోజు మాత్రమే సందర్శకులకు కన్పిస్తాయి. కానీ ఖైరతాబాద్ వినాయకుడికి, బాలాపూర్ లడ్డూలకు మాత్రమే ప్రత్యేక స్థానం ఉంది. ఈ సారి కూడా బాలాపూర్ వినాయకుడి లడ్డూ రికార్డు ధర ఫలికింది.

గురువారం ఉదయం పదిన్నర గంటలకే బాలాపూర్‌ వినాయకుడి లడ్డు వేలం ముగిసింది. ఈ సారి లడ్డు వేలంలో 28 మంది పాల్గొన్నారు. రూ. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి అనే భక్తుడు లడ్డును సొంతం చేసుకున్నాడు. గత ఏడాది 16.60 లక్షల రూపాయలు పలికింది. అంటే ఈ ఏడాది లక్ష రూపాయలు వచ్చినట్లు. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన యాత్ర గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా చాలా ముందుగానే మొదలైంది. ఉదయం సరిగ్గా ఆరున్నర గంటలకే మహా క్రేన్ నుంచి శోభాయాత్ర ప్రారంభం అయింది. గురువారం మధ్యాహ్నానికే ఈ మహా విగ్రహం నిమజ్జం పూర్తి కానుంది.

Next Story
Share it