Telugu Gateway
Telangana

సింగరేణి కార్మికులు ఒక్కొక్కిరికి 1,00,899 బోనస్

సింగరేణి కార్మికులు ఒక్కొక్కిరికి 1,00,899 బోనస్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సింగరేణి కార్మికులపై వరాల వర్షం కురిపించారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి సందర్భంగా 1,00,899 రూపాయల బోనస్ ప్రకటించారు. ప్రతి కార్మికునికి 1,00899 రూపాయలు అందించనున్నట్లు సీఎం కెసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. గత ఐదు సంవత్సరాలుగా సింగరేణి లాభాలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 1565 కోట్ల రూపాయల గరిష్ట లాభం సాధించిందని పేర్కొన్నారు. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్ లో సింగరేణి సాధిస్తున్న ప్రగతి ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.

కెసీఆర్ ప్రకటనపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి బోనస్ కు ఇన్ కం టాక్స్ కూడా ఉండదని తెలిపారు. గత సంవత్సరం కంటే 40వేల కు పైగా బోనస్ పెంచారు. కార్మికులు మంచి ఉత్పత్తి సాధిస్తున్నారు కాబట్టే సీఎం బోనస్ ప్రకటించారని వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీకి భయపడి బోనస్ పెంచారనడం అపోహ మాత్రమే అన్నారు. సింగరేణిలో బీజేపీ అనుబంధ సంఘం ఏ మాత్రం బలపడదన్నారు.

Next Story
Share it