Telugu Gateway
Politics

టీఆర్ఎస్ లో కొనసాగుతున్న అసంతృప్తి

టీఆర్ఎస్ లో కొనసాగుతున్న అసంతృప్తి
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోమంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తులు ప్రారంభం అయ్యాయి. అవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఛాన్స్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యేలు తమ మనసులోని బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేరారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కేవలం పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా నియమించి..రెండుసార్లు గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారా? అని ఆయన తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.

ఆయన సోమవారం నాడు కార్యకర్తలు, అనుచరులు, మిత్రుల భేటీలో ఆయన సోమవారంనాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాధాన్యత లేని పదవి ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు ఆయన కంటతడి కూడా పెట్టుకున్నారు. తనకు ఏ విధమైన పదవులు కూడా వద్దని, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటి నుంచి విద్యాసాగర రావు ఎక్కువగా ప్రజల ముందుకు రావడం లేదు.

Next Story
Share it