Telugu Gateway
Cinema

చందమామ ఓ వైపు..తాజ్ మహల్ మరో వైపు!

చందమామ ఓ వైపు..తాజ్ మహల్ మరో వైపు!
X

కాజల్. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దంపైనే అయింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ బహుశా ఎన్ని దేశాలు తిరిగి ఉంటుందో లెక్కేలేదు. అది షూటింగ్ లో భాగంగా కావొచ్చు..హాలిడే కింద కావచ్చు. కానీ ఆమె ఇంత వరకూ దేశంలోని ప్రపంచ వింతల్లో ఒకటై తాజ్ మహల్ ఇప్పటివరకూ చూడలేదంటే అది కూడా ఓ వింతే. కాజలే స్వయంగా తాను తొలిసారి తాజ్ మహల్ ను సందర్శించిన ఫోటోలను తన్మయత్వంతో తన అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రకరకాల హావభావాలతో తాను దిగిన ఫోటోలతోపాటు తన తండ్రి దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజ్ అందాలను చూసి తాను మైమరిపోయాయని కాజల్ చెబుతోంది. తాజ్ అందం గురించి ఎన్నో విన్నానని ఇప్పుడు తొలిసారి అనుభించానని పేర్కొన్నారు. తాజ్ అందాలను చూసి నోట మాట రాలేదంటున్నారు కాజల్. తాజ్ మహల్ లోని శిల్పకళతో పాటు ఇక్కడి ఎన్నో అంశాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. అంతే కాదు ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ చూశాక తాను ప్రేమ గురించి మాట్లాడిస్తోందని వ్యాఖ్యానించారు. కాజల్ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ‘చందమామ’ ఓ వైపు కాజల్ మరో వైపు అంటూ కుషీకుషీ అవుతున్నారు.

Next Story
Share it