Telugu Gateway
Andhra Pradesh

రిటైర్డ్ జడ్జితో ఏపీలో జ్యుడిషియల్ కమిషన్

రిటైర్డ్ జడ్జితో  ఏపీలో జ్యుడిషియల్ కమిషన్
X

ఏపీలో టెండర్లకు ఇక కొత్త ప్రక్రియ అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చెబుతున్నట్లు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటైంది.దీంతో ప్రభుత్వ శాఖల్లో వంద కోట్ల రూపాయలపైబడిన విలువతో కూడి అన్ని టెండర్లు ఆ కమిషన్ పర్యవేక్షణలోనే సాగనున్నాయి. ఎలాంటి అక్రమాలు..అవినీతికి తావులేకుండా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీని కోసం జడ్జిని కేటాయించాల్సిందిగా జగన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలసి వినతిపత్రం కూడా అందజేశారు. ఇప్పుడు ఓ రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి శివశంకరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ టెండర్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పారదర్శక విధానానికి ఇది దోహదం చేస్తుందని సర్కారు చెబుతోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో జులై 26, 2019న న్యాయ సమీక్ష బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన 25 రకాల పనులు ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత చట్టం పరిధిలోకి వస్తాయి. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటిన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. జడ్జి ఆ టెండర్‌కు సంబంధించిన పత్రాలను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో పెడతారు.

ఇందుకు సంబంధించి జడ్జి టెక్నికల్‌ టీమ్‌ నుంచి సలహాలు, సూచనలు, వివరాలు పొందవచ్చు. సంబంధిత శాఖ జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఆ తర్వాత 8 రోజుల పాటు జడ్జి వాటిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందిస్తారు. ఈ విధానంలో మొత్తం 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్‌ ఎవరికీ అదనపు లబ్ధి చేకూర్చకుండా.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు అభించనున్నాయి.

Next Story
Share it