Telugu Gateway
Andhra Pradesh

కీలక హామీని నెరవేర్చిన జగన్

కీలక హామీని నెరవేర్చిన జగన్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన హామీని పూర్తి చేసేశారు. నష్టాల ఊబిలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సర్కారు ఏర్పడిన వంద రోజుల్లోనే తొలి మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి విధాన నిర్ణయం తీసుకుని..,నిఫుణుల కమిటీని వేయటం..కమిటీ నివేదిక అందిన వెంటనే మంత్రివర్గంలో పెట్టి ఆమోదించటానికి రంగం సిద్ధం అయింది. దీంతో ఇక ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు మారిపోన్నారు. సర్కారు నిర్ణయంతో ఆర్టీసి కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ సర్కారు నిర్ణయంతో 52 వేల మంది ఉద్యోగులు లాభపడనున్నారు. ఆంజనేయరెడ్డి కమిటీ 90 రోజుల పాటు అధ్యయనం చేసిన తర్వాత మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి నివేదిక సమర్పించింది.

ఈ నివేదికపై ముఖ్యమంత్రి.. నిపుణుల కమిటీలోని సభ్యులతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు ప్రస్తుతం ఉన్న ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచాలని నిర్ణయించారు. బస్సు చార్జీలు ఫెయిర్‌గా ఉండేలా ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించారు. దశల వారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకురావాలని నిర్ణయించారు.

Next Story
Share it