Telugu Gateway
Cinema

అదరగొడుతున్న ‘గ్యాంగ్ లీడర్’ సాంగ్

అదరగొడుతున్న ‘గ్యాంగ్ లీడర్’ సాంగ్
X

ఆ పాటలో ఓ కొత్తదనం ఉంది. అందుకే ఇప్పుడు అది అదరగొడుతోంది. అదే గ్యాంగ్ లీడర్ సాంగ్. ఇందులో మరో విశేషం ఉంది. మ్యూజిక్ డైరక్టర్ సంగీత దర్శకుడు అనిరుధ్ హీరో నానితో కలసి ఆడి పాడటం మరో విశేషం. నాని నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌ ఇప్పటికే మంచి హైప్‌ను క్రియేట్‌ చేసింది.

నాని రచయితగా నటిస్తోన్న ఈ మూవీలో హీరో కార్తికేయ నెగెటివ్‌ రోల్‌ పోషిస్తుండటం మరో విశేషం. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, సాంగ్స్‌ తో మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ నుంచి ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. నానితో కలిసి సంగీత దర్శకుడు అనిరుధ్‌ వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఐదుగురి పాత్రలను వివరిస్తూ సాగిన ఈ పాట.. మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

https://www.youtube.com/watch?time_continue=46&v=6sDSZwH2EpM

Next Story
Share it