Telugu Gateway
Andhra Pradesh

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి
X

డాక్టర్..విలక్షణ నటుడు, రాజకీయ నేత ఎన్. శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో అనారోగ్యం పాలైన ఆయన శనివారం నాడు తుది శ్వాస విడిచారు. ఈ మాజీ ఎంపీ శివప్రసాద్ వయస్సు 68 సంవత్సరాలు. చెన్నయ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 12 న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచి డయాలసిస్‌ చేస్తున్నారు. శివప్రసాద్‌ మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

చంద్రబాబు శుక్రవారం నాడే సాయంత్రం శివప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. వైద్యుడిగా సేవలు అందిస్తూ చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక 2006లో ‘డేంజర్‌’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. అనంతరం రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పని చేశారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన రోజుకో వేషం వేస్తూ వినూత్నంగా నిరసనలు తెలిపారు.

Next Story
Share it