Telugu Gateway
Andhra Pradesh

చింతమనేని అరెస్ట్

చింతమనేని అరెస్ట్
X

వివాదస్పద టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ అయ్యారు. బుధవారం నాడు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా ఆయన అజ్ణాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసుల ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా ఆయన చిక్కలేదు. చింతమనేని ప్రభాకర్ స్వయంగా తన నివాసానికి వచ్చిన సందర్భంలో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.ఈ తరుణంలో పోలీసులు..చింతమనేని కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

ఎలాంటి సెర్చ్ వారంట్లు లేకుండానే తమ నివాసంలో సోదాలు నిర్వహించారని చింతమనేని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా వీరు ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతోపాటు చింతమనేనిపై పోలీసులు గత కొన్ని రోజులుగా మొత్తం 10 కేసులు నమోదు చేశారు.

Next Story
Share it