వైసీపీలోకి తోట త్రిమూర్తులు
BY Telugu Gateway15 Sept 2019 9:55 PM IST

X
Telugu Gateway15 Sept 2019 9:55 PM IST
ఊహించిందే జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారారు. అయితే ఇంత కాలం అది బిజెపినా..వైసీపీనా అనే తర్జనభర్జన ఉండేది. అయితే ఆయన శషబిషలకు తావులేకుండా వైసీపీలోకి జంప్ అయిపోయారు. ఆదివారం నాడు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరిక అనంతరం తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైఎస్సార్సీపీలో చేరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నేతను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు.
Next Story



