చిదంబరానికి నో బెయిల్
BY Telugu Gateway30 Sept 2019 4:14 PM IST

X
Telugu Gateway30 Sept 2019 4:14 PM IST
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సోమవారం నాడు చుక్కెదురు అయింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయన గత కొంత కాలంగా తీహర్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. చిదంబరానికి బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనను కొట్టిపారేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇదే కారణంతో చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు.
Next Story



