Telugu Gateway
Telangana

హిమాచల్ గవర్నర్ గా దత్రాత్రేయ ప్రమాణస్వీకారం

హిమాచల్ గవర్నర్ గా దత్రాత్రేయ ప్రమాణస్వీకారం
X

దత్తాత్రేయ గవర్నర్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం నాడు హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రామ సుబ్రహ్మణ్యన్ ఆయనచే బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.

హిమాలయ సంప్రదాయ టోపీ దరించి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్ తోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణతో సహా పలువురు బీజేపీ నేతలు, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story
Share it