తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా వినయభాస్కర్
BY Telugu Gateway7 Sept 2019 8:06 PM IST

X
Telugu Gateway7 Sept 2019 8:06 PM IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయింది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసీఆర్ పలు నిర్ణయాలు ప్రకటించారు. సమావేశాల కోసం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం ఖరారు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయభాస్కర్, విప్ లుగా గొంగిడి సునిత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధి, రేగ కాంతారావు, బాల్క సుమన్ లను ముఖ్యమంత్రి నియమించారు.
Next Story



