అనుష్క న్యూలుక్ వచ్చేసింది
BY Telugu Gateway11 Sept 2019 12:19 PM IST

X
Telugu Gateway11 Sept 2019 12:19 PM IST
అనుష్కశెట్టి సందడి మళ్లీ మొదలైంది. భాగమతి తర్వాత కన్పించకుండా పోయిన ఈ భామ ఇప్పుడు ‘నిశ్శబ్దం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అనుష్క స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో బుధవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో అనుష్క సాక్షి అనే చిత్రకారిణి పాత్ర పోషిస్తోంది.
మాటలు రాని సాక్షి తన మనసులోని మాటలు అన్నీ బొమ్మల రూపంలోనే చెప్పబోతుందట. ఇదే విషయాన్ని ఫస్ట్ లుక్ లో చెప్పేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Next Story



