Telugu Gateway
Cinema

స్టూల్ పై స్టైల్ గా అల్లు అర్జున్

స్టూల్ పై స్టైల్ గా అల్లు అర్జున్
X

వెనక ఓ మెగా టవర్. దానికి ఆనుకునే ఓ లగ్జరీ కారు. ఆ కారు ముందు స్టూల్ పై స్టైల్ గా కూర్చున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నోట్లో బీడి పెట్టుకుంటే దాన్ని వెలిగిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు. ఇన్ని ఉన్నాయి ఒక్క లుక్ లో. అదే అల..వైకుంఠపురం సినిమా ఫస్ట్ లుక్ లో కన్పించే సన్నివేశాలు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె, నివేదా పేతురాజ్ కూడా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కన్పించనుంది. 2020 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Next Story
Share it