Telugu Gateway
Cinema

అదరగొడుతున్న ‘సామజవరగమన’ సాంగ్

అదరగొడుతున్న ‘సామజవరగమన’ సాంగ్
X

అల వైకుంఠపురములో తొలి పాటే అదిరిపోయింది. అల్లు అర్జున్..పూజా హెగ్డె హీరో..హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పాటను చిత్ర యూనిట్ శనివారం ఉదయం పది గంటలకు విడుదల చేసింది. ‘సామజవరగమన..నిన్ను చూసి ఆగగలనా. మనసు మీద వయస్సుకున్న అదుపు చెప్పతగునా. సామజవరగమనా. నీకాళ్లను పట్టుకుని వదలనని అన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీకళ్ళకు కావలి కాస్తాయే కాటుకలా నా కళ్ళు. నువ్వు నలుపుతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు.’ అంటూ సాగే క్లాసికల్ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ పాటను చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరగటం ఖాయంగా కన్పిస్తోంది. గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నాడు. గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జులాయి..సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ జోడీ హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకుంటుందా? అంటే సంక్రాంతి వరకూ వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=Thf60JU8E98

Next Story
Share it