వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్
BY Telugu Gateway14 Aug 2019 2:20 PM IST
X
Telugu Gateway14 Aug 2019 2:20 PM IST
ఏపీలో వైసీపీకే మూడు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. అన్నీ ఏకగ్రీవం కానున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారి బాలకృష్ణమచార్యులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి మోపిదేవి వెంకటరమణ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ పదవుల నియమాకాల్లోనూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు.పదవుల పంపకంలో వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని తెలిపారు.
రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు నిర్వహించడానికి ఆగస్టు 7న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. టీడీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ నుంచి ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 16న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 19 వరకు అవకాశం కల్పించారు.
Next Story