చిక్కుల్లో టీడీపీ సీనియర్ నేత
BY Telugu Gateway26 Aug 2019 1:31 PM IST
X
Telugu Gateway26 Aug 2019 1:31 PM IST
ఏపీలో అక్రమ మైనింగ్ కు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సీఐడీ విచారణలో అక్రమ మైనింగ్ జరిగిందనే విషయం నిర్ధారణ అయిందని స్పష్టం చేసింది.
అదే సమయంలో ఈ అక్రమాలకు పాల్పడిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బ్యాంకు స్టేట్ మెంట్స్ లోనూ తేడాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story