Telugu Gateway
Cinema

‘అందం’గా ఉంటే అరెస్ట్ చేస్తారా?!

‘అందం’గా ఉంటే అరెస్ట్ చేస్తారా?!
X

అందానికి..అరెస్ట్ కు సంబంధం ఏంటి అంటారా?. నిజంగానే ఆమె తన అభిమానులను ఒకింత భయపెట్టింది. చేతికి బేడీలు వేసుకుంది. విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలా కుర్చీలో కూర్చుంది. ముందు ఎవరో పోలీసు ఉన్నట్లు వాదిస్తూ వచ్చింది. ఈ వీడియో చూసిన వారంతా నిజంగానే అసలు సోనాక్షి సిన్హాను ఎందుకు అరెస్ట్ చేశారా? అని అవాక్కయ్యే పరిస్థితి. ఆమె చాలా సీరియస్ గా పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగుతున్నట్లు కలరింగ్. తీరా చూస్తే అది అంతా ఓ యాక్షన్. ఓ సంస్థ కోసం చేసిన యాడ్ షూట్ లో భాగం అని తేలిపోయింది. కొంత మంది సోనాక్షి అభిమానులు ఆమెకు ఏమీ కాలేదు కదా? ఓకే అనుకుంటుంటే..కొంత మంది మాత్రం యాడ్ కోసం ఇంత ఓవర్ యాక్షనా? అంటూ విమర్శలు గుప్పించేవారు కూడా ఉన్నారనుకోండి. అస్లీసోనా అరెస్టెడ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిన్నటి నుంచి ఓ వీడియో ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ‘మీరు నన్ను ఇలా అరెస్టు చేయకూడదు. అసలు నేనెవరో తెలుసా? నేనే తప్పూ చేయలేదు.

ఇలా ఎలా అరెస్టు చేస్తారు’ అంటూ సోనాక్షి నిలదీస్తున్నట్లుగా ఉన్న వీడియోను చూసి ఆమె అభిమానులు తొలుత షాక్ కు గురయ్యారు. సోనాక్షి మైగ్లామ్‌ అనే మేకప్‌ కలెక‌్షన్‌ బ్రాండ్‌ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా ఆమె అరెస్టు అయినట్లుగా ఉన్న వీడియోను రూపొందించారు. ఈ క్రమంలో తన కొత్త యాడ్‌ విశేషాలను సోనాక్షి సిన్హా సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘ అవును నన్ను అరెస్టు చేశారు. ఎందుకో అడగండి?- ఎందుకంటే ఇంత అందంగా కనిపించడం నేరం కాబట్టి.!!! మై గ్లామ్‌ తరఫున ప్రచారం చేస్తున్నానని చెబుతున్నందుకు ఉద్వేగానికి లోనవుతున్నా. దీని ఉత్పత్తులతో మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎప్పుడైనా..ఎక్కడైనా’ అని మరోసారి ప్రోడక్ట్‌ ను ప్రమోట్‌ చేశారు.

Next Story
Share it