రామ్ చరణ్..కీర్తి సురేష్ లకు ‘సైమా అవార్డులు’

సైమా సందడి మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలు టాప్ మూవీలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. తాజాగా జాతీయ అవార్డుల్లో సత్తాచాటిన మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)లోనూ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. రంగస్థలం సినిమాకు గాను ప్రముఖ హీరో రామ్ చరణ్ కూడా ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్నారు. రెండు రోజుల పాటు జరిగే సైమా అవార్డు కార్యక్రమం ఈ సారి ఖతార్‌లోని దోహాలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్ లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది.
సైమా అవార్డ్స్ 2019 విజేతలు
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం)
ఉత్తమ నటుడు : రామ్‌చరణ్ (రంగస్థలం)
ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం)
విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)
ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి)
ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)
ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)
ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం)
ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం)
సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ : విజయ్ దేవరకొండ
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవే - రంగస్థలం)
ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( ఆర్‌ఎక్స్ 100)
ఉత్తమ గాయని : ఎంఎం మానసి (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం)
ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత)
ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్‌పుత్ (ఆర్‌ఎక్స్ 100)



