Telugu Gateway
Cinema

మహేష్ బాబు నిప్పుల వర్షం

మహేష్ బాబు నిప్పుల వర్షం
X

సూపర్ స్టార్ మహేష్ బాబు నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మహేష్ కొత్త సినిమా సరిలేరునీకెవ్వరు సినిమాకు సంబంధించి ‘నిప్పుల వర్షమొచ్చినా జనగణమణ అంటూ దూకేవాడే సైనికుడు. మంచు తుఫాను వచ్చినా వెనకడుగు లేదంటూ దాటేవాడే సైనికుడు...’ అంటూ దేశ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సైనికులను దృశ్యాలతో కూడిన టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు సైనికుడి పాత్ర చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా కథానాయిక. విజయశాంతి, సంగీత ముఖ్య పాత్రలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్‌ కానుంది.

https://www.youtube.com/watch?v=5imVvj_P5tE

Next Story
Share it