మహేష్ ‘ఫస్ట్ లుక్’ వచ్చేసింది
సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ తోపాటు స్వల్పనిడివి గల వీడియోను మహేష్ బాబు క్యారెక్టర్ పరిచయంగా విడుదల చేశారు. శుక్రవారం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్, వీడియో బయటకు వచ్చాయి. మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్ అంటూ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఆర్మీ మేయర్ లుక్‌లో మహేశ్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు.. నువ్వేళ్లే రహదారికి జోహర్లు, ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు అంటూ సాగే బ్యాగ్రౌండ్ బిట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది.
https://www.youtube.com/watch?time_continue=2&v=YaCGtGfoI1Q