Telugu Gateway
Cinema

‘సాహో’ వరల్డ్ రికార్డు

‘సాహో’ వరల్డ్ రికార్డు
X

‘సాహో’ అప్పుడే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. అది ఓ పాట రూపంలో కావటం మరో విశేషం. ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ లు కూడా యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొట్టాయి. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమాపై హైప్ పీక్ కు చేరింది. దేశ వ్యాప్తంగా సాహోపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా సాహో సినిమాలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో ప్రభాస్‌ బ్యాడ్‌ బాయ్‌ అంటూ ఓ ప్రత్యేక గీతానికి స్టెప్పులేసిన వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ తెగ ట్రెండ్‌ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే ఈ పాటను 85,24,114 మంది వీక్షించారు. అంతేకాకుండా 3,58,664 మంది లైక్‌ కొట్టారు. దీంతో ప్రపంచంలోనే కేవలం 24 గంటల్లో ఇన్ని లక్షల మంది వీక్షించిన తొలి పాటగా ‘సాహో.. బ్యాడ్‌ బాయ్‌’నిలిచింది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటించింది.

Next Story
Share it