Telugu Gateway
Cinema

‘సాహో’ ట్రైలర్ విడుదల

‘సాహో’ ట్రైలర్ విడుదల
X

‘సాహో’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలు.. మధ్యలో హీరో, హీరోయిన్ ల రొమాన్స్ సన్నివేశాలతో కూడిన ట్రైలర్ ఫుల్ రిచ్ గా ఉంది. యాక్షన్ ప్రేమికులకు ఈ సినిమా ఓ పండగలా ఉండబోతున్నట్లు కన్పిస్తోంది. ముంబయ్ లో జరిగిన రెండు వేల కోట్ల రూపాయల దోపిడీని ఛేజించే అండర్ కవర్ ఆఫీసర్ గా ప్రభాస్ ఈ సినిమాలో కన్పించనున్నట్లు ట్రైలర్ తో తేలిపోయింది. హీరోయిన్ శ్రద్ధాకపూర్ కూడా సహ అధికారిగా నటించింది. ముందు ప్రకటించినట్లుగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం సాహో ట్రైలర్ ను విడుదల చేసింది.

దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళంలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. మరి సాహో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో తెలియాలంటే ఆగస్టు 30 వరకూ వేచిచూడాల్సిందే. సాహో విడుదల కోసం పలు సినిమాల విడుదల తేదీలను కూడా కొంత మంది నిర్మాతలు వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

https://www.youtube.com/watch?time_continue=1&v=HNnt00swZ5Q

Next Story
Share it