Telugu Gateway
Cinema

‘సాహో’ ట్రైలర్ ఆగస్టు10న

‘సాహో’ ట్రైలర్ ఆగస్టు10న
X

ఈ మధ్య కాలంలో విడుదల అవుతున్న భారీ బడ్జెట్ సినిమా ఏదైనా ఉందీ అంటే అది ‘సాహో’నే. అంతే కాదు..ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. సాహోకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ వీడియోలు వచ్చినా అవి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో అత్యంత కీలకమైన ‘సాహో’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 10న సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా తొలిసారి శ్రద్దాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సాహో ఈ నెల 30 ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సాహో టీజర్‌ ఆన్‌లైన్‌ వ్యూస్‌లో రికార్డ్‌ సృష్టించగా ట్రైలర్‌ మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it