రైలులో కలవనున్న మహేష్..రష్మిక
BY Telugu Gateway3 Aug 2019 8:36 AM GMT

X
Telugu Gateway3 Aug 2019 8:36 AM GMT
మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ రెండవ షెడ్యూల్ ప్రారంభం అయింది. ఇందులో హీరోయిన్ రష్మిక మందన కూడా జాయిన్ అవుతున్నారు. అయితే వీరి తొలి పరిచయంలో రైలులోనే జరగటం..అక్కడ నుంచే లవ్ ట్రాక్ మొదలవుతుందని సమాచారం. కాశ్మీర్ నుంచి మహేష్ బాబు కర్నూలు ప్రయాణిస్తుండగా ఈ సీన్లు చోటుచేసుకోనున్నాయి. సంక్రాంతి బరిలో ఈ సినిమాలో నిలవనున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ముందే ప్రకటించారు.
అందుకు అనుగుణంగా షూటింగ్ సాగుతోంది. ఈ సినిమా ఓ లాఫర్ ఎక్స్ ప్రెస్ వంటిదని నిర్మాత అనిల్ సుంకర వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత ఇందులో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని విడుదల చేసే అవకాశం ఉందని టాక్.
Next Story