Telugu Gateway
Cinema

‘రణరంగం’ మూవీ రివ్యూ

‘రణరంగం’ మూవీ రివ్యూ
X

శర్వానంద్. టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో ఒకరు. కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అందులో చాలాసార్లు విజయాలు దక్కించుకున్నాడు కూడా. తాజాగా ‘రణరంగం’ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నటన పరంగా శర్వానంద్ కు వంకలు పెట్టడానికి ఏమీ లేకపోయినా కథలో సరైన దమ్ములేకపోవటంతో ఈ సినిమా దూకుడు చూపించలేకపోయిందని చెప్పొచ్చు. మూవీ అసలు కథ విషయానికి వస్తే విశాఖపట్నంలో తన స్నేహితులతో కలిసి బ్లాక్‌ టిక్కెట్లు అమ్ముకునే దేవా (శర్వానంద్‌).. లిక్కర్‌ మాఫియాకు కింగ్‌లా మారతాడు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేద సమయంలో దేవా లిక్కర్‌ స్మగ్లింగ్‌ చేస్తూ.. ఆర్ధికంగా పీక్ కు వెళతాడు. ఈ క్రమంలో లోకల్‌ ఎమ్మెల్యే సింహాచలం(మురళీ శర్మ)-దేవాల మధ్య శతృత్వం పెరుగుతుంది. అదే సమయంలో గీత(కళ్యాణీ ప్రియదర్శిణి)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవా.. ఓ పాప పుట్టిన తరువాత గొడవలన్నింటిని వదిలేసి స్పెయిన్‌కు వెళ్తాడు. దేవా స్పెయిన్‌కు ఎందుకు వెళ్లవలసి వచ్చింది? గీత ఏమైంది? అన్నదే సినిమా. ఈ సినిమాలో శర్వానంద్ రెండు పాత్రల్లో మంచి వేరియేషన్స్ చూపించాడు.

గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కళ్యాణీ ప్రియదర్శన్‌ పాత్ర విభిన్నంగా ఉంటుంది. అంతే కాదు..ఇందులో ఆమె నటన కూడా ఆకట్టుకుంటుంది. మరో హీరోయిన్ కాజల్‌ పాత్ర చాలా పరిమితం. ప్రముఖ నటుడు మురళీ శర్మ ఇందులో తన రొటీన్ నటనకు భిన్నంగా కొత్త శైలిని చూపించాడు. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ ఆసక్తికరంగా సాగగా.. సెకండాఫ్‌లో సినిమా నెమ్మదించినట్లు కన్పిస్తుంది. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌ను అందంగా.. అందరికీ కనెక్ట్‌ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. తొంభైవ బ్యాక్‌ డ్రాప్‌ను అందంగా తెరకెక్కించేందుకు కెమెరామెన్‌ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే శర్వానంద్ ‘రణరంగం’ సినిమాతో ఫ్యాక్షన్ మరో సారి పూర్తి స్థాయిలో ఆకట్టులేకపోయాడని చెప్పొచ్చు.

రేటింగ్.2.75/5

Next Story
Share it