భారతీయుడు2లో రకుల్
BY Telugu Gateway13 Aug 2019 10:10 AM IST
X
Telugu Gateway13 Aug 2019 10:10 AM IST
టాలీవుడ్ లో కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ వస్తోంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నఈ మూవీలో కమల్ హాసన్ నటిస్తున్నారు. ఆయనకు జోడీగా కాజల్ నటిస్తుండగా..సిద్ధార్ధకు జోడీగా రకుల్ ప్రీతిసింగ్ ను తీసుకొచ్చారు. ఆమె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021లో విడుదల కానుంది.
తొలుత బడ్జెట్ సమస్యలు రావటంతో సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా కమల్ హాసన్ భారతీయుడు లుక్ లో కన్పించటంతోపాటు..షూటింగ్ కూడా ప్రారంభం కావటంతో అనుమానాలు అన్నీ పటాపంచలు అయ్యాయి. మరి భారతీయుడు 2తో శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచిచూడాల్సిందే.
Next Story