Telugu Gateway
Cinema

రకుల్ సంచలన వ్యాఖ్యలు

రకుల్ సంచలన వ్యాఖ్యలు
X

మన్మథుడు2 ట్రైలర్ లో సిగరెట్ తాగుతూ కన్పించి విమర్శలు ఎదుర్కొన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సినిమాలో హీరో పొగతాగితే తప్పు కాదు..కానీ హీరోయిన్ పొగతాగితే మాత్రం తప్పా?. అని ప్రశ్నించారు. అయినా అది పాత్ర వరకు మాత్రమే అని..తనకు అసలు సిగరెట్ తాగే అలవాటులేదన్నారు. తాను ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. సిగరెట్ కు ఎవరూ ప్రభావితం కాకూడదనే ప్రతి సినిమా ముందు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు కదా? అని వ్యాఖ్యానించారు. మన్మథుడు2లో అవంతిక మాత్రమే సిగరెట్ తాగుతుందని..రకుల్ ప్రీత్ సింగ్ కాదన్నారు.

నాలుగు పాటలు..కొన్ని సీన్లు ఉన్న పాత్రల కంటే మంచి పేరు తెచ్చిపెట్టే స్కోప్ ఉన్న పాత్రలకే తాను ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మన్మథుడు2లో చేసిన పాత్ర ఇప్పటివరకూ తనకు దక్కలేదని..ఇది ఓ మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. షూటింగ్ పూర్తయిన రోజు తాము అంతా బాధపడ్డామని..ఎందుకంటే ఈ సమయంలోనే తాము ఓ కుటుంబంగా మసలుకున్నామని తెలిపారు. హీరో నాగార్జున ఎంతో సపోర్టివ్ అని..ఏ మాత్రం హీరోయిజం చూపించకుండా అందరితో కలసి మెలసి ఉండేవారన్నారు. రాహుల్ ఓ మంచి దర్శకుడు అని ప్రశంసలు కురిపించారు.

Next Story
Share it