‘సాహో’ సెన్సార్ పూర్తి

ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 30 నుంచి ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయటమే మిగిలింది. బాహుబలి రెండు భాగాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావటంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లిపోయాయి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా భాలీవుడ్ బామ శ్రద్దాకపూర్ నటించిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమా పాటలతో, టీజర్, ట్రైలర్‌తో ఎన్నో రికార్డులు నమోదు చేసింది. తాజాగా సాహో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.
ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 51 నిమిషాలు. ఈ సినిమాను సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. తాజాగా ప్రభాస్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇక నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేయనని ప్రకటించారు. కనీసం ఏడాదికి ఒక సినిమా చేసేలా ప్లాన్ చేసుకుంటానన్నారు. రాజమౌళి బాహుబలి తర్వాత భారీ హిట్స్ ఇవ్వటంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందని తెలిపారు.