Telugu Gateway
Cinema

అనుష్కపై ప్రభాస్ కంప్లైంట్ ఏంటి?

అనుష్కపై ప్రభాస్ కంప్లైంట్ ఏంటి?
X

ప్రభాస్ సాహో సినిమాతో మళ్ళీ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ప్రభాస్ వార్తలే. పలు మీడియా సంస్థలతో మాట్లాడుతున్న ప్రభాస్ కూడా పలు ఆసక్తికర అంశాలు వెల్లడిస్తున్నారు. సక్సెస్ ఫుల్ జోడీ ప్రభాస్, అనుష్కల ఎఫైర్ పై ప్రతిసారిలాగే ఈ సారి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఈ గోల తట్టుకోలేను...కనీసం అనుష్కను అయినా తొందరగా పెళ్లి చేసుకోమని చెబుతా అంటూ స్పందించారు ఈ బాహుబలి హీరో. తాజాగా అనుష్కపై ఆయన ఓ కంప్లైంట్ చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవసరం అయినప్పుడు ఫోన్ చేస్తే మాత్రం స్పందించదని చెప్పారు.

అయితే అనుష్క అందం..రూపంపై మాత్రం ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో తనతో కలసి పనిచేసిన కాజల్ అగర్వాల్ పై కూడా ప్రభాస్ కామెంట్లు చేశారు. నిత్యం ఉత్సాహంగా ఉండే కాజల్ అందంగా..స్టైల్ గా డ్రెస్ లు వేసుకుంటుందని కితాబిచ్చారు. ‘సాహో’ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో ప్రభాస్ అభిమానుల్లో సందడే సందడి. సుమారు 350 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించిన ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it