‘శ్రీదేవి’గా పూజ
BY Telugu Gateway26 Aug 2019 9:11 AM IST
X
Telugu Gateway26 Aug 2019 9:11 AM IST
పూజా హెగ్డె ఈ మధ్య ఓ ఫోటోసెషన్ తో హాట్ హాట్ ఫోజులిచ్చారు. దీనిపై ఓ వైపు విమర్శలు రాగా..మరో వైపు కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. హాట్ హాట్ ఫోటోలపై వచ్చిన విమర్శలను పూజా లైట్ తీస్కోంది. దేహమే దేవాలయం అంటూ..ఇలా ఫోటోలు దిగటం తప్పేమీకాదని సమర్ధించుకుంది. ఫోటో సెషన్ ఫోటోలకు పూర్తి భిన్నంగా పూజా హెగ్డె హోమ్లీ లుక్ లో ‘శ్రీదేవి’గా దర్శనమిచ్చింది.
సంప్రదాయ దుస్తులు వేసుకుని సైకిల్ పై స్వారీ చేస్తుందీ ఈ భామ. వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి సినిమాలోని చిత్రమిది. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఆదివారం పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో పూజా కనిపించనున్నారు.
Next Story