Telugu Gateway
Politics

మోడీ ప్రసంగంలో ఏమి ఉంటుంది?!

మోడీ ప్రసంగంలో ఏమి ఉంటుంది?!
X

అందరిలో ఇప్పుడు అదే ఉత్కంఠ. జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు, 35 సెక్షన్ తొలగింపు వంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న మోడీ సర్కారు దేశ ప్రజల మన్ననలు పొందుతోంది. దేశ వ్యాప్తంగా మెజారిటీ ప్రజలు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 7న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ రోజు వరకూ పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో సమావేశాలు ముగిసిన తర్వాత దేశ ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడే అవకాశం ఉంది. మోడీ తన ప్రసంగంలో ఆర్టికల్‌ 370 రద్దు పూర్వాపరాలను వివరించడంతో పాటు ప్రధాని మరికొన్ని కీలక నిర్ణయాలను తన ప్రసంగంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు.

ప్రధాని ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో 7న జరిగే అఖిలపక్ష భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగానికి తూట్లు పొడవటమే అని రాజ్యసభలో విపక్ష నేత గులాం​ నబీ ఆజాద్‌ విమర్శించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. పీడీపీ సభ్యులు ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీఎస్పీ సమర్ధించడం విశేషం.

Next Story
Share it