Telugu Gateway
Politics

రాజ్యసభలో చొక్కాలు చింపుకున్న పీడీపీ సభ్యులు

రాజ్యసభలో చొక్కాలు చింపుకున్న పీడీపీ సభ్యులు
X

కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను సోమవారం నాడు పార్లమెంట్ ను కుదిపేశాయి. కాశ్మీర్ అంశంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. ఆర్టికల్‌ 370 రద్దును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్షాల తీవ్ర నిరసనల నడుమే హోంమంత్రి అమిత్‌ షా సంచలన నిర్ణయం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్‌, పీడీపీ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ఆరోపించారు. ఆర్టికల్‌ 370 రద్దును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. భయాందోళనలు రేకెత్తించి కశ్మీర్‌ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దేశ రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతులను చించివేసిన పీడీపీ సభ్యుల తీరును గులాం నబీ ఆజాద్‌ తప్పుపట్టారు. చొక్కాలు చించుకుని తీవ్ర ఆందోళన చేపట్టిన పీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు పంపాలని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు మార్షల్స్‌ ను ఆదేశించారు. మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దును నిరసిస్తూ విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశాయి.

Next Story
Share it