పాయల్ ఆ బ్రాండ్ కు ఫిక్స్ అవ్వాల్సిందేనా!
హీరో అయినా అంతే. హీరోయిన్ అయితే అంతే. ఒక్కసారి ఓ బ్రాండ్ పడింది అంటే అది అంత తొందరగా పోదు. దాన్ని పొగొట్టుకోవాలంటే ఎంతో కసరత్తు చేయాలి. హీరో అయినా.ఆ హీరోయిన్ అయినా మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి. అలాంటి వారికే ఫస్ట్ ఇంప్రెషన్ చెరిపేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే అలాంటి పాత్రలతోనే చేసినన్ని సినిమాలు చేసి తప్పుకోవాల్సిందే. దీనికి హీరో అయినా..హీరోయిన్ అయినా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ దీ అదే పరిస్థితి. తెలుగులో తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 తరహలోనే ఆర్ డీఎక్స్ లవ్ అంటూ ముందుకొస్తోంది. ఈ సినిమాలోనూ అందాలు అరబోయటంలో ఈ భామ ఏ మాత్రం తగ్గినట్లు లేదు.
తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న కొత్త చిత్రమే ‘ఆర్‌డీఎక్స్ లవ్’. శంకర్ భాను దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. తాజాగా పాయల్ స్టిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చూస్తుంటే పాయల్ ఈ బ్రాండ్ తోనే కొన్ని రోజులు కంటిన్యూ అయ్యేలా ఉందని చెబుతున్నారు. ది దాటి బయటకు రావాలంటే ఆమె చాలా కష్టపడాల్సిందే. అది సాధ్యం అవుతుంది. ఏ పాత్ర అయినా సరే చేస్తానని నిరూపించుకోగలదా?. అందుకు ఆమెకు అవకాశాలు వస్తాయా?.ఇస్తారా? ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉండే సినీ రంగంలో ఆ ఛాన్స్ ఉంటుందా?. ఇఛ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్ళటమేనా?. వేచిచూడాల్సిందే.