చంద్రబాబు ఇంటికి నోటీసులు
BY Telugu Gateway17 Aug 2019 11:48 AM IST

X
Telugu Gateway17 Aug 2019 11:48 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంటికి ఏపీ సర్కారుకు మరో సారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇది అక్రమ కట్టడం అంటూ ఆ భవనం యాజమాని లింగమనేని రమేష్ కు సీఆర్ డీఏ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కృష్ణా నది వరద ముంపునకు ఈ నివాసంలోకి నీళ్ళు రావటంతో ఇక్కడ ఉండటం ప్రమాదకరం అని...ఇళ్ళు ఖాళీ చేయాలని నోటీసులు ఇఛ్చినట్లు సమాచారం.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వీఆర్వో ప్రసాద్ శనివారం నోటీసులిచ్చారు. వరద ముప్పు కారణంగా చంద్రబాబు నివాసంతో పాటు మరో 32 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు నివాసానికి నోటీసులివ్వడానికి వెళ్లిన వీఆర్వోను ఇంట్లో ఎవరు లేరంటూ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకుండా బయటనే నిలిపివేశారు. దీంతో నోటీసులు వారికి అందజేసి వెనుదిరిగారు.
Next Story