నితిన్ గడ్కరీకి తప్పిన ముప్పు
BY Telugu Gateway13 Aug 2019 6:32 AM GMT

X
Telugu Gateway13 Aug 2019 6:32 AM GMT
ఇండిగో విమానం ఒకటి ప్రయాణికులను వణికించింది. అందులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. నాగపూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతికలోపం తలెత్తడంతో పైలట్ టేకాఫ్‌ను నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులను కిందకు దింపేశారు. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 636లో లోపాన్ని గుర్తించిన పైలట్ టేకాఫ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని ఇండిగో కూడా ధృవీరించింది. కేంద్రమంత్రి గడ్కరీ సహా, 143 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమాచారం అందించామని వెల్లడించింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ నాగపూర్ విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ విజయ్ మూలేకర్ ఒ ప్రకటనలో తెలిపారు.
Next Story