Telugu Gateway
Andhra Pradesh

పోలవరం నుంచి ‘నవయుగ ఔట్’

పోలవరం నుంచి ‘నవయుగ ఔట్’
X

అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నుంచి ఏపీ సర్కారు నవయుగా ఇంజనీరింగ్ ను తప్పించింది. నామినేషన్ పై అప్పగించిన పనులతో పాటు విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని ఆదేశించింది. మరి దీనిపై నవయుగా కంపెనీ, ఒరిజినల్ కాంట్రాక్ట్ సంస్థ అయిన ట్రాన్స్ స్ట్రాయ్ లు ఎలా స్సందిస్తాయో వేచిచూడాల్సిందే. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతి జరిగిన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్ మోడల్ ను ఫాలో అవుతామని ప్రకటించారు. అందులో తొలి ప్రాజెక్టు పోలవరం కాబోతోంది. ప్రస్తుతం ఎలాగైనా వర్కింగ్ సీజన్ కాదు కాబట్టి..ప్రస్తుత సంస్థలను తప్పించి..మళ్ళీ కొత్తగా పనులకు టెండర్లు పిలవటం ద్వారా సీజన్ ప్రారంభం అయ్యే నాటికి కొత్త ఏజెన్సీలను ఎంపిక చేసేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కాంట్రాక్ట్ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

నిర్మాణ పనుల నుంచి వైదొలగాలని నవయుగకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రీ క్లోజర్ నోటీసులు ఇచ్చారు. 60 సి నిబంధన ప్రకారం హెడ్ వర్క్స్ పనులు చేస్తున్న నవయుగా. 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు 60 సి ప్రకారం పనుల అప్పగింత 3 వేల కోట్ల విలువైన పనులు నవయుగకు అప్పగిస్తూ నాడు ఒప్పందం కుదిరిన సంగతి తెలసిందే. అదే సమయంలో 3220 కోట్ల జల విద్యుత్ టెండర్లు కూడా గతంలో దక్కించుకున్న నవయుగజల విద్యుత్ ప్రాజెక్ట్ నుంచీ తప్పుకోవాలని సూచించారు. మరి ఈ వ్యవహారం అంతా సాఫీగా సాగిపోతుందా? లేక కోర్టులకు ఎక్కుతుందా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it